![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1056 లో...నువ్వు సీఈఓ అయింది ఆ రేఖ చెప్పినట్లు వినడానికా అని ఇందుపై అపర్ణ కోప్పడుతుంది. అయ్యో అమ్మమ్మ.. మీకు ఈ ఇందు గురించి తెలియదు.. నా సపోర్ట్ తో ఇందు సీఈఓ అయిందని రేఖ అనుకుంటుంది.. కానీ కానీ ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే అలా రేఖ తనకి సపోర్ట్ చేసేలా ప్లాన్ చేసింది ఇందునే అని రాజు చెప్తాడు. ఏంటమ్మ అని ఇందుని అపర్ణ అడుగుతుంది. మీరు నాపై నమ్మకం ఉంచండి అమ్మలో ఉన్న ధైర్యం.. మీరు నాలో ఉందని చెప్పారు. ఆ ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుందని అపర్ణ వాళ్ళకి ఇందు చెప్తుంది.
ఆ తర్వాత ఐశ్వర్య దగ్గరికి ఇందు వచ్చి.. తన చెంప చెల్లుమనిపిస్తుంది. ఏంటే నన్ను కొడుతున్నావ్.. సీఈఓ అయ్యానన్న పొగరు వచ్చిందా అని ఐశ్వర్య కోప్పడుతుంది. నువ్వు చేసిన పనికి ఏం చేసినా తప్పు లేదు.. నేను నీ గురించి కుటుంబం గురించి ఆలోచించే కదా.. సీఈఓ అయిందని ఇందు చెప్తుంది. నువ్వు ఇంకా నటించకని ఐశ్వర్య అనగానే సరే నేను నటిస్తున్నాను.. ఇక మీదట నువ్వే అన్ని చూసుకో.. నీ అప్పు కూడా నేను తీర్చను.. నీ ఖర్చులకి డబ్బు కూడా ఇవ్వను.. ఆంటీని కూడా ఇవ్వనివ్వనని ఇందు చెప్తుంది. మరొకవైపు నువ్వు సీఈఓ అవుతావనుకుంటే దాన్ని సీఈఓ చేసావేంటని రేఖని భూషణ్ అడుగుతాడు. ఇప్పుడు మనం ఎన్నో రోజులుగా ఒక డీల్ వస్తే వద్దనుకున్నాం.. దొంగ బంగారం కొనడం.. ఇప్పుడు అది డీలింగ్ కుదర్చుకుంటున్నాము.. దానికి సంబంధించిన వాటిపై ఇందు సంతకం చేస్తుంది. అప్పుడు కోట్లు మనకి.. ప్రాబ్లమ్ తనకి అని రేఖ చెప్తుంది.
దాంతో ప్లాన్ అదిరిందని రేఖతో భూషణ్ అంటాడు. డబ్బు చూసి ఎన్ని రోజులు అవుతుందోనని భ్రమరాంబ అంటుంది. ముందు అయితే డబ్బు రాగానే అప్పులన్ని తీర్చాలని భూషణ్ అంటాడు. అప్పులన్నీ తీర్చేసి ఆస్తులన్నీ నా పేరున చేసుకుంటానని రేఖ అంటుంది. మరొకవైపు ఐశ్వర్య అద్దంలో తన మొహం చూసుకుంటూ చెంపకి పడ్డ చేతివేలు అచ్చులు చూసుకొని మాట్లాడతుంది. ఇందు నిన్ను వదిలిపెట్టనే అని ఐశ్వర్య అంటుంది. అప్పుడే స్వాతి వస్తుంది. ఏమైంది అక్క చెంపకి చెయ్ అడ్డం పెట్టావని ఐశ్చర్యని స్వాతి అడుగుతుంది. ఏం లేదని ఐశ్వర్య అనగానే చెయ్ తీసి స్వాతి చూస్తుంది. ఏంటి అక్క ఎవరో కొట్టినట్లున్నారు.. ఇందు అక్క అయితేనే ఇలా కొడుతుందని స్వాతి అంటుంది. నేను అంత చూసానులే అక్క అని స్వాతి అంటుంటే.. ఐశ్వర్యకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |